ముంబైలో పండ్లు అమ్ముకుంటున్న కరడుకట్టిన UP గ్యాంగ్ స్టర్ అరెస్ట్

  • Published By: nagamani ,Published On : September 7, 2020 / 04:56 PM IST
ముంబైలో పండ్లు అమ్ముకుంటున్న కరడుకట్టిన UP గ్యాంగ్ స్టర్ అరెస్ట్

Updated On : September 7, 2020 / 5:18 PM IST

నేరాలు చేశాడు..కరడుకట్టిన గ్యాంగ్ స్టర్ గాఘోరాతి ఘోరమైన కిరాతకమైన దారుణాలు చేశాడు.51 కేసుల్లో నిందితుడు..మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. హత్యలు..కిడ్నాపులు..దోపిడీలు ఇలా చేయని నేరమంటూ లేదు. కానీ పోలీసులకు చిక్కకుండా వేషం మార్చుకుని పండ్లు అమ్ముకుంటున్నాడు. కానీ పోలీసులు మాత్రం వదల్లేదు. వెతికి వేటాడి శనివారం (సెప్టెంబర్ 8,2020)అరెస్ట్ చేసి కటకటాల్లో పడేశారు.


ఉత్తరప్రదేశ్ లో మీరట్ కు చెందిన ఆషు జాట్ ఘరానా క్రిమినల్. అతని వయస్సు 32 ఏళ్లు. అతని వయస్సుకంటే అతను చేసిన నేరాల సంఖ్యే ఎక్కువ.అతని పేరు చెబితే నేరాలకే దడ పుడుతుంది. జాలి, దయా, కనికరం అనే పదాలకు అర్థం కూడా తెలియని దుర్మార్గుడు ఆషుజాట్. ఆషుపై 51 కేసులకుపైగానే ఉన్నాయి. వాటిలో హత్యలు, కిడ్నాప్ లు, దోపిడీలు చేస్తూ..ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేవాడు. నేరాల్లో భాగంగా..బిజెపి రాజకీయ నాయకుడు రాకేశ్ శర్మను హత్య చేశాడు. అలాగే నోయిడాకు చెందిన ఎగ్జిక్యూటివ్ గౌరవ్ చందేల్‌ను జనవరి 7 న హత్య చేశాడు. ఇటువంటి హత్యలు ఎన్నో అతని నేరాల ఖాతాలో ఉన్నాయి.


https://10tv.in/assam-doctor-college-principal-couple-arrested-in-nagaon/
అతడిని పట్టుకోవటానికి పోలీసులు ఎన్ని ప్లాన్స్ వేసినా తప్పించుకునేవాడు. దీంతో పోలీసులు అతనిపై రూ.2.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ‘మిర్చి గ్యాంగ్’ అనే పిలిచే ఆషు జాట్ గ్యాంగ్ లో మొత్తం 25 మంది సభ్యులున్నారు. కళ్లల్లో కారం కొట్టి దోపిడీలకు చేస్తుండటంతో ఆ గ్యాంగ్ కు ‘మిర్చి గ్యాంగ్’ అనే పేరొచ్చింది. ఆషుజాట్ పోలీసులకు దొరికేవాడు కాదు..కానీ జాత్ భార్య పూనంతో పాటు మరికొందరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆషుజాట్ మాత్రం తప్పించుకున్నాడు.


ఏ రకంగానూ ఆషుజాట్ చిక్కకపోవటంతో పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేయటానికి ప్లాన్ వేశారు. ఓ హెల్త్ కేర్ కంపెనీ రీజినల్ మేనేజర్ హత్య కేసులో యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే సమాచారంతో ఆషు జాట్ ముంబై పారిపోయాడు. అక్కడ వేషం మార్చుకుని..కరోనా క ష్టంతో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నవాడిలా మారాడు.


ఆషుజాట్ ముంబైలో ఉంటున్నాడనే విషయాన్ని పసిగట్టిన పోలీసులు అతని వేటకు అన్ని రకాలుగా సిద్దమయ్యారు. ముంబై వచ్చారు. పండ్లు అమ్ముకుంటున్న ఆషుని పరిశీలించారు. పోలికలన్నీ మారిపోయాయి. గుర్తించటం చాలా కష్టమైంది. అయినా సరే అతన్ని రోజు పరిశీలించటం మానలేదు. అతను ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నాడు?అనేదానిపై రెక్కీ చేసి..ఆఖరికి ఓ రోజున అతడు స్నేహితులకు ఫోన్ కాల్స్ చేస్తున్న విషయం గుర్తించి..ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ను ట్రాక్ చేయడం ద్వారా అతను ఆషు జాట్ అనే నిర్థారణకు వచ్చారు. ఆపై ఇంకేముంది? అరెస్ట్ చేశారు.