Google Pixel 9a : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9aపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!
Google Pixel 9a : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా కొత్త పిక్సెల్ 9aపై ఖతర్నాక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Google Pixel 9a
Google Pixel 9a Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025లో అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో (Google Pixel 9a) గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9aపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనపు సేవింగ్స్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.3-అంగుళాల అక్టా pOLED డిస్‌ప్లే, 5,100mAh బ్యాటరీ ఉన్నాయి. స్టైలిష్‌గా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. గూగుల్ పిక్సెల్ 9a డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అక్టా pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రిజల్యూషన్ 1080×2424 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో 4వ జనరేషన్ టెన్సర్ G4 చిప్‌సెట్ ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించింది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. కొలతల విషయానికి వస్తే.. ఈ పిక్సెల్ 9a ఫోన్ పొడవు 154.7 మిమీ, వెడల్పు 73.3 మిమీ, మందం 8.9 మిమీ, బరువు 185.9 గ్రాములు ఉంటుంది.
బ్యాటరీ బ్యాకప్ :
పిక్సెల్ 9aలో 5100mAh బ్యాటరీ కూడా ఉంది. 45W పవర్ అడాప్టర్, 7.5W వైర్‌లెస్ Qi ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-FI 6E, బ్లూటూత్ 5.3, AFC, GPS, NavIC, USB టైప్ C 3.2 పోర్ట్ వంటివి ఉన్నాయి.
కెమెరా ఫీచర్లు :
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ f/1.7 అపర్చర్, f/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో f/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9a ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.7వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.42,999కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.40,050 సేవ్ చేసుకోవచ్చు.