వైసీపీ అభ్యర్థిపై దాడి వార్తలు అబద్దం

  • Publish Date - April 8, 2019 / 02:40 AM IST

కర్నూలు వైసీపీలో కలకలం చోటుచేసుకుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ తన చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే హఫీజ్ ఖాన్‌పై దాడి జరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారంటూ నియోజకవర్గంలో వార్తలు గుప్పుమనడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే తనపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలను హఫీజ్ ఖాన్ ఖండించారు. ఇంట్లో జారిపడిపోవడం వల్ల తన చేతికి బలమైన గాయమైందని, తనపై ఎవరూ దాడికి పాల్పడలేదని స్పష్టంచేశారు. చేతికి వైద్యులు శస్త్రచికిత్స చేశారని, కాస్త విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనపై ఎలాంటి దాడి జరగలేదని, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ వ్యవహారంపై అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు.