ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ : భట్టి విక్రమార్కకు వడదెబ్బ

  • Publish Date - May 2, 2019 / 05:24 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు వడదెబ్బ తగిలింది. మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు వైద్యులు. రెస్టు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ కాంగ్రెస్ పేర్కొంటోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు