రిటర్న్: వైసీపీలోకి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్‌కు కేటాయించడంతో రగిలిపోతున్న ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీలో ఉండటం అనవసరమని నిర్ణయాంచుకున్నట్లు తెలుస్తుంది.

  • Publish Date - March 21, 2019 / 07:53 AM IST

తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్‌కు కేటాయించడంతో రగిలిపోతున్న ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీలో ఉండటం అనవసరమని నిర్ణయాంచుకున్నట్లు తెలుస్తుంది.

కర్నూలు: ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సొంత గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ టికెట్ పై కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి కొంతకాలం క్రితం టీడీపీలో చేరారు. ఎన్నికల తరుణంలో తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. కర్నూలు టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశంకు వెళ్లిన ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు.

తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్‌కు కేటాయించడంతో రగిలిపోతున్న ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీలో ఉండటం అనవసరమని నిర్ణయించుకున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరడం.. టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఎస్వీకి అనుచరగణం ఉందని తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి వెళుతున్నారు. ఎస్వీ వెళ్లిపోవడం టీడీపీకి మైనస్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. డబ్బు కోసం ఎలాంటి వారికైనా టికెట్లు కేటాయిస్తారని విమర్శించారు. ఎంపీ రేణుకను కూడా చంద్రబాబు ఇలానే మోసం చేశారని ఎస్వీ అన్నారు. 2009లో ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని చంద్రబాబు మోసం చేశారని.. పదేళ్ల తర్వాత తనను మోసం చేశారని ఎస్వీ చెప్పారు. నెల రోజుల క్రితం సర్వేలు అనుకూలంగా ఉన్నాయి మీకే టికెట్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. సడెన్ గా సర్వేలు అనుకూలంగా లేవని చెప్పడం దారుణం అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తాను కృషి చేస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.