దేశరక్షణ కోసం మళ్లీ గెలిపించండి :  పాలమూరు లో మోడీ

  • Publish Date - March 29, 2019 / 10:30 AM IST

మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే  విపక్షాలు  వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము  కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతున్నానని మోడీ అన్నారు.మహూబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడి  శుక్రవారం పాల్గొన్నారు.  “మీ ఆశీర్వాదంతో ఐదేళ్లు ప్రధానిగా  పాలన అందించాను. దేశానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడకు వచ్చాను.  అంతరిక్షంలో కూడా సత్తా చాటేలా మిస్సైల్ రూపోందించాం.   నవ భారతాన్నినిర్మించేందుకు మళ్ళీ  బీజేపీ కి ఓటు వేటయండి.  ఉగ్రవాద కార్యకలాపాలు అరిక్టటాం. ఉగ్రవాదులకు సహాయం చేసే వారి చుట్టూ ఉచ్చు బిగించాం”  అనిమోడీ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో  ఇటీవల  అసెంబ్లీ ఎన్నికలుజరిగాయని,  జ్యోతిష్యుడు  చెప్పాడని ముందస్తు ఎన్నికలకి వెళ్లి కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేశారని మోడీ కేసీఆర్ ను విమర్శించారు. ఇన్నికోట్ల భారం ప్రజలపై పడుతోందని ఆయన తెలిపారు. ముందుస్తుకు వెళ్లినంత తొందరగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేక పోయారని  విమర్శించారు. ఏప్రిల్ లో అసెంబ్లీ కి ,  పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరిగితే, మోడీ హవాముందు మీరు ఓడిపోతారని  జ్యోతిష్యుడు ముందే చెప్పాడని అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. త్వరలో టీఆర్ఎస్ కుడా ముక్కలవుతుందని మోడీ జోస్యం చెప్పారు.  తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రజలు నిర్ణయస్తారా, జ్యోతిష్యుడు నిర్ణయిస్తాడో మీరే తేల్చుకోండని మోడీ కోరారు. స్వలాభం కోసం, కుటుంబం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని మోడీ  ఆరోపించారు.  కేంద్రం  పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజలకు అందకుండా చేస్తోందని అన్నారు. దేశంలో కోటి 50 లక్షల మందికి ఇళ్లు కట్టించామని, తెలంగాణా ప్రభుత్వం ఆ ఇళ్లను తీసుకోకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ల  పధకం ప్రవేశ పెట్టి  మధ్యలో ఆపేసిందని ఆరోపించారు.

టీఆర్ఎస్ రాజ్యాంగవిరుధ్దమైన చర్యలు చేపడుతోందని, స్వార్ధంతో  ఎంఐఎంతోచెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని మోడీ ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్  రాజ్యాంగంలో లేని ముస్లిం రిజర్వేషన్  గురించి పదే పదేప్రస్తావిస్తున్నది ఎవరి కేసం అని  మోడీ ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత బీజేపీ కు  ఉందని ఆయన  అన్నారు. మీ చౌకీ దారును  అడుగుతున్నాను. ఏప్రిల్ 11 నమీరు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాని అన్నారు.