మోడీ మళ్లీ ప్రధాని అవుతారు: నిర్మలా సీతారామన్

  • Publish Date - March 24, 2019 / 08:01 AM IST

హైదరాబాద్ :  నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . హైదరాబాద్‌ సైనిక్‌పురిలోని హెచ్ఎంటీ బేరింగ్స్ కమ్యూనిటీ హాల్లో  ఎక్స్‌ సర్వీస్‌మెన్లు, మేథావులతో బీజేపీ నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు  లక్ష్మణ్,  మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం మల్కాజ్ గిరి  పార్లమెంట్ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రూపోందిస్తోంది.