కేవలం రూ.10 రూపాయలకు పడిన కక్కుర్తి కాస్తా..ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది ఓ వ్యాపారికి. ఆ చార్జీలని ఈ చార్జీలని కష్టమర్ల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఫుడ్స్ విషయంలో ఇది జరుగుతోంది. ఓ ఐస్ క్రీమ్ కొన్నా..పాలు..పెరుగువంటి కూలింగ్ ప్రొడక్ట్ విషయంలో కూలింగ్ చార్జీలు కూడా కష్టమర్ల దగ్గరే వసూలు చేస్తుంటారు. ఇది ప్రతీ రోజు జరిగేదే. అలా ఓ వ్యాపారి కూలింగ్ చార్జీ అంటూ రూ.10 లు వసూలు చేయాలని చూడా కోర్టుదాకా వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు ఏకంగా…2 లక్షల రూపాయల జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిసాక..తిక్క బాగా కుదిరింది..అనిపిస్తోంది కదూ..
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్ర రాజధాని ముంబైకా చెందిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ 2014, జూన్ 8న తన కూతురితో కలిసి షగుణ్ వెజ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్ బాక్స్ కొన్నారు. దానికి 175 రూపాయలు చెల్లించాడు. కానీ తరువాత ఎక్సైరీ డేట్ చూద్దామని చూడగా MRP రేటు 165 రూపాయలు మాత్రమే ఉంది.
దీంతో కనిపించింది. దీంతో ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ ప్యాకెట్ మీద రూ.165 ఉంటే నువ్వేంటీ రూ.175 లకు అమ్ముతున్నావేంటి? నా 10 రూపాయలు తిరిగి ఇచ్చేయమని హోటల్ యజమానిని అడిగారు..దానికి వాళ్లు..ఆ 10 రూపాయలు కూలింగ్ ఛార్జ్ అని రెస్టారెంట్ యజమాని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన జాధవ్ కూలింగ్ అనేది మీరు కొన్న సరుకు పాడవ్వకుండా చూసుకునేది అది కష్టమర్ల మీద వేయటం ఏంటీ ? నా రూ.10 నాకు ఇచ్చేయమని అడిగగా..ఇవ్వటం కుదరదు సార్..అని కరాఖండీగా చెప్పేసరికి ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ ఓహో..అలాగే నీ తిక్క కుదురుస్తానుండు..అంతకంతా వదిలానని అనుకుంటూ..సరాసరి వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు.
దీనిపై విచారణ జరిన తరువాత తాజాగా కోర్టు తీర్పు వచ్చింది. MRP రేటు ఎక్కువ ధర వసూల్ చేసిన రెస్టారెంట్ కు కోర్టు 2,45,000 రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు ఫిర్యాదు దారుడైన సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ కు రెస్టారెంట్ యాజమాన్యం రూ.15వేలు నష్టపరిహారం చెల్లించాలని..ఈ మొత్తం డబ్బంతా 45 రోజుల్లో చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో సదరు రెస్టారెంట్ యజమాని బావురుమన్నాడు. 10 రూపాయల దానికి ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని లబోదిబోమన్నాడు. కాగా..ఇలా జరిమానా వేసిన నగదు అంతా వినియోగదారువల సహాయ నిదికి వెళుతుంది.
కోర్టు తీర్పుపై ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ మాట్లాడుతూ..”కోర్టు తీర్పుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెస్టారెంట్ ఇలా ఒక్కొక్కరి దగ్గరా రూ .10లు అదనంగా వసూలు చేసుకుంటూ పోతే ప్రతీ వినియోగదారుడు రూ.10లు నష్టపోతున్నారు. ఇది నాకు నచ్చలేదు. అందుకే వినియోగదారుల కోర్టును ఆశ్రయించాను. ఇది కేవలం నాకు మాత్రమే జరగటంలేదు. ప్రతీ వినియోగదారుడికి జరిగుతోంది. కానీ ప్రతీ ఒక్కరూ స్పందిస్తేనే ఈ దోపిడీ ఆగుతుంది అని అన్నారు. ఇది కేవలం రూ10 గురించి కాదు..నా ఉద్దేశ్యం నా హక్కుల కోసం పోరాడటం అంతేకాదు వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించడం కోసం ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇకనైనా సదరు రెస్టారెంట్ అధిక ఛార్జీలు వసూలు చేయట ఆగుతుందని నేను ఆశిస్తున్నానని అన్నారు. ఇది ప్రతీ వ్యాపారికి గుణపాఠం కావాలని కూడా ఆశిస్తున్నాని అన్నారు.
ఇటువంటివి దాదాపు ప్రతీ వినియోగదారుడికి జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. ఎవరికి వారు ఇలా దాటవేసుకుంటూ పోతుండటంతో ఇలా అధికంగా వినియోగదారుల నుంచి వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు. కానీ నష్టపోయిన ప్రతీ ఒక్క వినియోగదారుడు స్పందిస్తే..ఇటువంటి దోపిడీలు ఆగిపోతాయి.