పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్య

  • Publish Date - September 14, 2019 / 05:29 AM IST

కృష్ణా జిల్లా చిన అవుటుపల్లిలో దారుణం జరిగింది. పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్యకు గురయ్యాడు. శుక్రవారం (సెప్టెంబర్ 13) అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సూపర్ వైజర్ వెంకటేశ్వర్రావు ఇంట్లో ప్రవేశించి కత్తులతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో వెంకటేశ్వర్రావును పొడిచి చంపారు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థాలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  వెంకటేశ్వర్రావు స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురంగా గుర్తించారు. కాగా వెంకటేశ్వరావును చంపాల్సిన అవసరం ఎవరికుంది? పాత కక్షలేమైనా ఉన్నాయా? హత్య చేయటానికి వచ్చినవారు ఎంతమంది? ఎందుకు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.