ముచ్చటైన ఫ్యామిలీ : టీడీపీ ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

  • Publish Date - April 7, 2019 / 08:16 AM IST

టీడీపీలో మరో స్టార్ క్యాంపెయినర్ జాయిన్ అయ్యారు. కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీ సభకు చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య బ్రాహ్మణి హాజరయ్యారు. ఆమెతోపాటు చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా హాజరయ్యి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా కోడలు, మనవడుతో వచ్చిన చంద్రబాబును చూసి అందరూ షాక్ అయ్యారు. బ్రాహ్మణి ఓ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ రాజకీయ సమావేశాలు, సభలకు రాలేదు ఆమె.
బ్రాహ్మణితో పాటు వచ్చిన దేవాంశ్‌.. పూలు పెట్టి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించాడు. వేధిక మీది తిరుగుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచాడు దేవింశ్. బ్రాహ్మణి నందిగామ సభకు హాజరుకావటంతో టీడీపీ క్యాడర్ పెద్దఎత్తున సంబురాలు చేసుకుంది. కుర్రోళ్లలో జోష్ కనిపించింది. ముచ్చటైన చంద్రబాబు ఫ్యామిలీ అంటూ వృద్ధులు చర్చించుకోవటం కనిపించింది. వేదికపై ఉన్న బ్రాహ్మణిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. వేదిక కింద నుంచే ఫొటోలు తీసుకున్నారు. సభకు హాజరైన ప్రజలకు పదేపదే నమస్కారం చేస్తూ బ్రాహ్మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.