అప్పట్లో జైహింద్ అన్నందుకు జైల్లో పెట్టారు: నారా లోకేష్

  • Publish Date - February 13, 2020 / 02:21 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం తీసుకుని వచ్చారని ప్రశ్నించారు నారా లోకేష్. అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం మాట్లాడిన నారా లోకేష్.. జగన్ బ్రిటీష్ వారి పాలనను గుర్తు తెస్తున్నారని అన్నారు.

బ్రిటిష్ వాళ్లు జైహింద్ అన్నందుకు అప్పట్లో స్వాతంత్ర సమరయోధులను జైళ్లలో పెడితే.. ఇప్పుడు జై అమరావతి అన్నందుకు వైఎస్ జగన్ రైతులను జైళ్లలో పెడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు డబ్బులు దండగని, కారుకి డీజిల్ దండగని, ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ రాష్టానికి ఏమి తెచ్చారని ప్రశ్నించారు.

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయిన యువకులను నందిగామ సబ్ జైలులో పరామర్శించారు లోకేష్. యువకుల అక్రమ అరెస్టులకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని అన్న లోకేష్.. ఉద్యమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ తోడుగా ఉంటానని అన్నారు.