ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువ : NCRB

  • Publish Date - September 2, 2020 / 02:50 PM IST

భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఇది చాలా ఎక్కవని రిపోర్టు తెలిపింది.



2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా, మహిళల శాతం 29.8 గా ఉంది.

వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషుల సంఖ్యే అధికమని NCRB పేర్కొంది. వివాహం తర్వాత ఆత్మహత్య చేసుకున్నవారు 68.4 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పగా, 62.5 శాతం మంది మహిళలు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.



కాగా గ్రామాల్లో కంటే నగరాల్లోనే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 53.6 శాతం ఉరివేసుకోగా, 25.8 శాతం మంది విషం తీసుకుని, 5.2 శాతం మంది నీళ్లలో మునిగి, 3.8 శాతం నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే ఇంకొందరు కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా 5.4 శాతం మంది, అనారోగ్య కారణాల వల్ల 17.5 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు