నిజామాబాద్ ఎన్నికలు : బ్యాలెట్లా?..ఈవీఎంలు ?

  • Publish Date - March 30, 2019 / 02:03 AM IST

నిజామాబాద్‌లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించే  ప్రత్యామ్నాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.   ఇందుకోసం Bell M -3 యాంత్రాలను పరిశీలించింది. ఇందులో  ఒకేసారి 383 మంది అభ్యర్థులకు పోలింగ్‌ నిర్వహించే అవకాశం  ఉంది. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో 185 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు. దీంతో అక్కడ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావించింది. ప్రత్యామ్నాయంగా బెల్ ఎం 3 యంత్రాలనూ పరిశీలిస్తోంది. సాధ్యాసాధ్యాలపై పరిశీలించింది.  దీనిపై త్వరలోనే ఈసీ ఓ నిర్ణయం తీసుకోనుంది.
Read Also : ఒకే గదిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా

గత కొంత కాలంగా పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలుపుతూ అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్  పార్టీ నుంచి మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు.

2006 నుంచి 2010 వరకు ఉన్న ఎం-2 ఈవీఎంల్లో నాలుగింటిని లింక్ చేయడం ద్వారా… 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఇబ్బంది లేకుండా పోయింది. 2013 తర్వాత ఎం-3 ఈవీఎంలను వాడుతున్నారు. వాటిలో 384మంది అభ్యర్థుల పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది. గుర్తుల విషయంలోనూ గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంది. 
Read Also : కారణం అదే : ప్రియాంక, నిక్ జోనస్ విడాకులు?