ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలను పసిగట్టలేక చివరకు శాసనమండలిలో వైసీపీ వెనుకంజ వెయ్యక తప్పలేదు. అమరావతిపై సాగిన పోరులో చివరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ఫలించాయి. తెలుగుదేశం పార్టీ వేసే ఎత్తులకు, వ్యూహాలకు అధికార వైసీపీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తుంది.
ఈ క్రమంలోనే శాసనమండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమని అన్నారు. నేను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశా. సెలెక్ట్ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు.
అదే నిర్ణయం తీసుకుంటే.. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోటానికి సెలెక్ట్ కమిటీకి తగినంత సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ ముగియటానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3నెలు. దీని అర్ధం 3 నెలల్లోపు ఇమ్మని కాదని అన్నారు యనమల.
అయితే యనమల వ్యూహం ప్రకారం ఒకవేళ ప్రజాభిప్రాయానికే సెలెక్టెడ్ కమిటీ వెళ్తే.. ఇప్పట్లో వ్యవహారం తేలదు. ఇదే టీడీపీ వ్యూహం అని నిపుణుల అభిప్రాయం.