నిజం ఇదే : 3 తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్తపై స్పందించిన అధికారులు

మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన

  • Publish Date - October 30, 2019 / 05:35 AM IST

మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన

మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన ఖండించారు. అసలు నిజం ఏంటో వివరించారు. ఆ ముగ్గురు డెంగీతో చనిపోలేదని అన్నారు. అంతేకాదు అసలు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కాదని వెల్లడించారు.

ముందుగా చనిపోయిన లింగయ్య అనే వ్యక్తి వేరే ఇంటివాడు అని అధికారులు వివరించారు. అతనిది నార్మల్‌ డెత్‌ అని చెప్పారు. ఇక రాజగట్టు అనే వ్యక్తి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడని.. ప్లేట్‌ లెట్స్ తగ్గాయి కానీ అది డెంగీ అని ప్రభుత్వాస్పత్రిలో నిర్ధారణ కాలేదన్నారు. అలాగే రాజగట్టు కూతురుకి జ్వరం అంటూ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారన్న భీష్మ.. అక్కడ అడ్మిట్‌ అవ్వకపోవడంతో జ్వరంతో చనిపోయిందని వెల్లడించారు.

డెంగీ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు అనే వార్త పూర్తిగా అవాస్తవం అని అధికారి స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డెంగీ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.