online gambling in tamilnadu : ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్..జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎంతో మంది అప్పులు చేసి..ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజగా..తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ను బ్యాన్ చేసింది. రమ్మీ ఆడితే..ఆరు నెలల పాటు జైలు శిక్ష, రూ. 5 వేల వరకు జరిమాన విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆన్ లైన్ గేమింగ్ హౌస్ నడిపిన వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ గేమ్ ఆడుతూ..పలువురు మృత్యువాత పడుతున్న తరుణంలో..తమిళనాడు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరుకు..రాష్ట్ర గవర్నర్ భనర్వీలాల్ పురోహిత్ శుక్రవారం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేశారు.
కరోనా కారణంగా..విధించిన లాక్ డౌన్ తో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందులో ఆన్ లైన్ రమ్మీ ఒకటి. బెట్టింగ్ లు పెడుతూ..గేమ్స్ ఆడుతున్నారు. ఫలితంగా..చేసిన అప్పులు తీర్చలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టెలివిజన్ రేటింగ్స్ ని మించి పోయాయి. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కారణంగా..అమాయక ప్రజలు మోసపోతున్నారని ప్రధానంగా..అందులో యువకులుంటున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఆత్మహత్యలను నివారించడానికి, మోస పోకుండా ఉండేందుకు (Gaming Act, 1930; Chennai City Police Act 1888 and the Tamil Nadu District Police Act 1859) ప్రకారం..ప్రభుత్వం గవర్నర్ కు ఓ ప్రతిపాదన సమర్పించింది.
ఇటీవలే…ఆన్ లైన్ రమ్మీకి ప్రచారం చేసినందుకు క్రికేటర్లు కోహ్లీ, గంగూలీ, ప్రకాష్ రాజ్, సుదీప్, రానా, తమన్నాలకు మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మధురైకి చెందిన మహ్మద్ రజ్వీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆన్ లైన్ రమ్మీ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని సూచించిన క్రమంలో…పలు ప్రభుత్వాలు చర్యలకు దిగుతున్నాయి. ఏపీ రాష్ట్రం ఆన్ లైన్ రమ్మీ, వివిధ గేమ్స్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.