రేపిస్టుల్ని బహిరంగంగా ఉరి తీయాలి..లేదా..కెమికల్ క్యాస్ట్రేషన్ చేయాలి..ఇమ్రాన్ ఖాన్

  • Publish Date - September 15, 2020 / 02:07 PM IST

పాకిస్తాన్ లోని లాహోర్ జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. ఇద్దరు పిల్లలతో బైక్ పై వెళ్తున్న మహిళను ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి ఈ అత్యాచారానికి తెగబడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్లలో ఇద్దరిని పోలీసులు సోమవారం (సెప్టెంబర్ 14,2020)అరెస్ట్ చేశారు. వీరికి కఠిన శిక్ష వేయాలని యావత్ దేశం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది..నినాదాలు చేస్తోంది.


ఈక్రమంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..అత్యాచార కేసులో దోషిలుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. అయితే పాకిస్థాన్ అలా చేయలేదని...అలా చేస్తే పాకిస్థాన్ నుంచి యూరోపియన్ యూనియన్ తమ వ్యాపార సంబంధాలను విరమించుకుంటుందని అన్నారు.

కాగా..కెమికల్ క్యాస్ట్రేషన్ పద్ధతి చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇమ్రాన్ వ్యక్తం చేశారు. హత్య కేసుల్లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్నట్లే అత్యాచార కేసుల్లో ఫస్ట్ డిగ్రీలో భాగంగా అత్యాచారం చేసిన దోషుల వృషణాలను రసాయనిక పద్ధతుల్లో తొలగించాలని సూచించారు. బహిరంగ ఉరికి బదులుగా కెమికల్ కాస్ట్రేషన్ పద్ధతిని పరిశీలిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కామాంధులకు ఇదే సరైన శిక్ష అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేస్తే దేశంలో అత్యాచారాలు తగ్గుతాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. గత ఫిబ్రవరిలో పాకిస్థాన్ చట్టసభ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడినవారిని.. పిల్లలను హత్య చేసినవారిని బహిరంగంగా ఉరి తీయాలని చట్టాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ చట్టం ఇప్పటి వరకూ ఆమోదించబడలేదు.

ట్రెండింగ్ వార్తలు