జనసేన-టీడీపీ చీకటి ఒప్పందం : డీవై దాస్ రాజీనామా

  • Publish Date - March 23, 2019 / 10:44 AM IST

రాజకీయాల్లో అడుగు పెట్టి..ఎ న్నికల బరిలో నిలిచిన జనసేన చీఫ్ ‘పవన్ కళ్యాణ్‌’కు షాక్ తగిలింది. పార్టీ ప్రారంభించిన సమయంలో ఒక్కడినేనని.. ఇప్పుడు మాత్రం ఎంతో మంది ఉన్నారని ప్రకటించిన ‘పవన్’కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ రాజీనామా చేశారు.

మార్చి 23వ తేదీ శనివారం డీ.వై దాస్ జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. దళిత ఓటు బ్యాంకు కోసం BSPని పావుగా వాడుతున్నారంటూ అసంతృ‌ప్తి వ్యక్తం చేశారు. ఏపీలో పవన్, చంద్రబాబు ముసుగు రాజకీయాలంటూ అక్కసు వెళ్లగక్కారు. 

డీ.వై.దాస్.. ఈయన కాంగ్రెస్ నేత. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకపోవడంతో డీవై దాస్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయం వచ్చే సరికి ఏదైనా పార్టీలో చేరాలని భావించారు. టీడీపీ, వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా.. జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. పామర్రు బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ టికెట్ ఇవ్వలేదు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఏకంగా జనసేనకు గుడ్ బై చెబుతున్నారు డీవై దాస్.