21ఏళ్ల కుర్రాడు.. అంచనాలు అస్సలు లేని జట్టు.. ప్రత్యర్ధుల జ్టటులో మహామహులు. అయినా కూడా 27బంతుల్లో 78పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అజరామర విజయం అందించాడు. ముంబై వేదికగా జరిగిన మూడవ ఐపిఎల్ మ్యాచ్‌లో యువ ఆటగాడు గత ఛాంపియన్‌లను మట్టి కరిపించాడు.
ఐపీఎల్ 12వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను దాని సొంతగడ్డపై మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవ రికార్డున్న ఢీల్లీ జట్టు.. ముంబయ్‌లోని వాంఖడెలో 37 పరుగుల ముంబై ఇండియన్స్ జట్టుపై గెలిచింది.
Read Also : DC Vs MI పంత్ పిచ్చికొట్టుడు.. ముంబై టార్గెట్ 214
తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రిషబ్ పంత్(78 నాటౌట్; 27 బంతుల్లో 7×4, 7×6) చెలరేగి ఆడాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కొలిన్ ఇంగ్రామ్ (47; 32 బంతుల్లో 7×4, 1×6), శిఖర్ ధావన్ (43; 36 బంతుల్లో 4×4, 1×6) కూడా ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.2 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్ (2/34), రబాడ (2/23) ముంబై ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. యువరాజ్ (53; 35 బంతుల్లో 5×4, 3×6) మాత్రం చక్కనైన ఇన్నింగ్స్ కనబరిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్:
పృథ్వీ షా (సి) డికాక్ (బి) మెక్లెనగన్ 7;
ధావన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 43;
శ్రేయస్ (సి) పొలార్డ్ (బి) మెక్లెనగన్ 16;
ఇంగ్రామ్ (సి) హార్దిక్ (బి) కటింగ్ 47;
పంత్ నాటౌట్ 78;
కీమో పాల్ (సి) డికాక్ (బి) మెక్లెనగన్ 3;
అక్షర్ పటేల్ (సి) సలామ్ (బి) బుమ్రా 4;
తెవాతియా నాటౌట్ 9;
ఎక్స్‌ట్రాలు 6
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 213;
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్:
రోహిత్ శర్మ (సి) తెవాతియా (బి) ఇషాంత్ 14;
డికాక్ (సి) బౌల్ట్ (బి) ఇషాంత్ 27;
సూర్యకుమార్ రనౌట్ 2;
యువరాజ్ సింగ్ (సి) తెవాతియా (బి) రబాడ 53;
పొలార్డ్ (సి) తెవాతియా (బి) కీమో పాల్ 21;
హార్దిక్ పాండ్య (సి) అండ్ (బి) అక్షర్ 0;
కృనాల్ పాండ్య (సి) తెవాతియా (బి) బౌల్ట్ 32;
కటింగ్ (సి) పంత్ (బి) రబాడ 3;
మెక్లెనగన్ (స్టంప్డ్) పంత్ (బి) తెవాతియా 10;
రసిక్ సలామ్ నాటౌట్ 5;
ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్) 176;