పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేష్ రెడ్డితో పాటు మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మహేష్ రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. మహేశ్వర్ రెడ్డి 2018 ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Read More : విద్యార్థి సంఘాల హర్షం : ఇంటర్ బోర్డు సెక్రటరీ బదిలీ