కార్యకర్తలకు పిలుపు: బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • Publish Date - September 15, 2019 / 10:27 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదం ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. బోటు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అని చనిపోయిన వ్యక్తుల కటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే బోటు ప్రమాదం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కూడా స్పందించారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతవడం బాధాకరమని చెప్పిన పవన్ కళ్యాణ్.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్కడ అవసరమైన సాయాన్ని జనసేన కార్యాకర్తలు అందించాలని కోరారు.