ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటే వైసీపీ నాయకులు తనను ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోనంటూ నిప్పులు చెరిగారు.
జగన్ ఆర్నెళ్ల పాలన అంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు కూల్చడం, కాంట్రాక్టులు రద్దు చేయడం, పవన్ కళ్యాణ్ ని తిట్టడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ టమోటా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టమోటా రైతుకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని నిలదీశారు.
రైతులు రోడ్డున పడుతున్నారు పట్టించుకోట్లేదని అన్నారు. ఆధారం లేకుండా నిందలు వెయ్యకూడదనేది జనసేన సిద్ధాంతం అని, అందుకే వేచి చూశామని, ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడక తప్పదని అన్నారు. రెండు నెలల క్రితం టమోట రైతుల ఆవేదన తనకు తెలిసిందని, ఇప్పుడు ప్రశ్నించడానికి రుజువులు ఉన్నాయని అన్నారు.