పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!

  • Publish Date - March 22, 2019 / 02:07 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తుల విషయం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తన దగ్గర  డబ్బు లేదంటూ పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు కూడా. అయితే తాజాగా ఆయన దగ్గర ఉన్న ఆస్తులను ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. ఈ సంధర్భంగా శాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పత్రాలు సమర్పించిన పవన్.. తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
Read Also : విజయసాయికి పవన్ వార్నింగ్: నేతాజీ, భ‌గ‌త్ సింగ్ వార‌సులం అవుతాం

పవన్ పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు.. రూ.40కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అదే సమయంలో తనకు రూ.32.40 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు చూపించారు. తనకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ.2.40 కోట్లు, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ. 1.25 కోట్లు, తన వదిన కొణిదెల సురేఖ వద్ద రూ. కోటి ఏడు లక్షల డెభ్భై మూడూ వేల ఏడు వందల ముఫ్పై నాలుగు (రూ.1, 07, 73,734) అప్పును తీసుకున్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.

అలాగే ఎమ్. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర రూ.3కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌ దగ్గర రూ.2 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియా దగ్గర రూ.2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయ దగ్గర రూ.27.55 లక్షలు అడ్వాన్సులు, చేబదుళ్లు రూపంలో తీసుకున్నట్లు తెలిపారు.