నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్

  • Publish Date - April 9, 2019 / 08:37 AM IST

ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్

ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్ అన్నారు. కేసీఆర్ మద్దతు తెలిపినంత మాత్రాన ఎవరూ గెలవరు అని పవన్ చెప్పారు. పాలకొల్లులో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. పవన్ కి మద్దతుగా నాగబాబు, అల్లు అర్జున్ పాలకొల్లులో ప్రచారం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు తాను మద్దతిస్తానని వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అయ్యారు. ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదాకు కేసీఆర్ ఎందుకు మద్దతివ్వలేదని పవన్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ఎందుకు స్పందించాల్సి వచ్చిందని అడిగారు. ప్రధాని మోడీపై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ టీఆర్ఎస్ కలిసి రాలేదని పవన్ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే నాకు అభిమానం అంటూనే.. ఆయనపై విమర్శలు చేశారు పవన్. తెలంగాణలో ఆంధ్రులు భయపడే పరిస్థితి ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

వైసీపీ చీఫ్ జగన్ పైనా పవన్ విమర్శలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ.. సొంత ఇంట్లో హత్య జరిగితే రక్తపు మరకలు చెరిపేసిన వారు.. ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారు అని.. జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ప్రశ్నించారు. 2014లో అనుభవం గల వ్యక్తి అని చంద్రబాబుకి మద్దతిస్తే.. చంద్రబాబు అనుభవం ఇసుకు మాఫియాకు పనికొచ్చిందని పవన్ విమర్శించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ చెప్పారు. పార్టీని నడపటానికి వేల కోట్ల రూపాయలు అవసరం లేదన్నారు.

ఏపీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆంధ్రా నాయకుల్లో ఒక్కరికి కూడా తెలంగాణలో మాట్లాడే దమ్ము లేదని పవన్ అన్నారు. తెలంగాణ నాయకుల కనిపిస్తే నేనూ గౌరవిస్తా అని చెప్పిన పవన్.. ఆంధ్రుల ఆత్మగౌరవం మాత్రం చంపను అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి రక్షణగా, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి వాళ్లు పడేసే బిస్కెట్లకు.. జగన్ లా తాను ఆశించనని, టీఆర్ఎస్ లో కలవనని పవన్ స్పష్టం చేశారు.
Read Also : వైసీపీకి అడ్రస్ ఉండదు.. డిపాజిట్ కూడా దక్కదు