న్యాయం కోసం నినదించా: జగన్ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం

  • Publish Date - February 28, 2020 / 01:52 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు సుగాలి ప్రీతి అత్యాచారం, హత్యకేసును జగన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బాలిక కేసులో కోరిందే జరిగిందని.. ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా ఓ లేఖను విడుదల చేశారు. సుగాలి ప్రతి కేసులో కోరిందే జరిగింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీ.బీ.ఐ)కి అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. శ్రీ జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను. 

మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రుల కడుపు కోత, ఆవేదన, ఆక్రందన నేను స్వయంగా చూశాను. తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి సైతం రాకూడదు.

నడవలేని ప్రతీ తల్లి చక్రాల కుర్చీలో మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఆమె చెప్పిన అమానుష సంఘటన గురించి విన్న తర్వాత ఈ పరిస్థితి ఏ పసిపాపకు రాకూడదని భావించాను. ఆ సంకల్పంతోనే ఈ నెల 12వ తేదీన కర్నూలు వీధుల్లో సుగాలి ప్రీతి కేసెులోమ న్యాయం కోసం నినదించాను.

చివరికి బాలిక తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు స్వాంతన లభించింది. ఈ పోరాటంలో అండగా ఉన్న కర్నూలు ప్రజానికానికి, పాత్రికేయులకు, ప్రజా సంఘాలను అభినందనలు. ఇటువంటి అవమానీయ ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై, అటు సమాజంపై ఉంది. అని అన్నారు పవన్ కళ్యాణ్.