కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Publish Date - March 24, 2019 / 05:21 AM IST

అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే  బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు.  అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలకు బంటుమల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పెడన బస్టాండ్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు మచిలీపట్నం జల్దు కళ్యాణ్ గారి తోట వద్ద ఉన్న బైపాస్ రోడ్డు వద్ద ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  మచిలీ పట్నం నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ రాజీవ్ గాంధీ సెంటర్లో బహిరంగ సభ లో పాల్గోంటారు.  అక్కడ్నించి బయలు దేరి  రాత్రి 8గంటలకు గుంటూరు జిల్లా వేమూరు లో  జరిగే సభలో ఆయన పాల్గోంటారు.