ప్రజలు రోడ్డు మీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలం అయినట్లే: పవన్ కళ్యాణ్

  • Publish Date - November 3, 2019 / 01:15 PM IST

వైఎస్ జగన్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎవరికి సరదా కాదు రోడ్ల మీదకు రావాలంటే ఒళ్లు నలిగిపోతుంది అయినా కూడా వచ్చామంటే ప్రజల కోసం అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేవు. రోడ్ల మీదకు రావడం నాకు సరదా కాదు. 6 నెలల్లోనే జగన్ ప్రభుత్వం విఫలమైంది. భవన నిర్మాణ కార్మికుల బాధలను చూడలేకే ఈ లాంగ్ మార్చ్‌ నిర్వహించాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం అయ్యింది అని అర్థం అన్నారు పవన్. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే నడుములు ఇరిగిపోతాయి. అయినా కూడా ప్రజల కోసం వచ్చాను. పార్టీ నడపాలంటే నాకు వేల కోట్లు లేవు.. వేల ఎకరాలు లేవు అయినా కూడా నడుపుతున్నానంటే ప్రజల కోసం అని అన్నారు. 

నాకు సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి. వాటిని వదులుకున్నవాడిని నాకు డబ్బులు మీద ఆశ లేదు. ఈ రోజు ఇన్ని వేల మంది మధ్యలో మీ ప్రేమ నన్ను అడుగు వెయ్యనివ్వలేదు. జీపు మీద రావలిసి వచ్చింది. ఈ రోజు ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే బాధలు చెప్పుకోవడానికే కదా? అభివృద్ధి ఆగిపోతుందని అర్థం అయ్యే కదా? ఇంతమంది వచ్చారు అని అన్నారు పవన్ కళ్యాణ్.

వైఎస్ జగన్ అద్భుతమైన పాలన అందిస్తే నాకు రాజకీయాలు అక్కర్లేదు. వెళ్లి సినిమాలు చేసుకుంటా.. ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే సామాన్యుల నుంచి నాయకుడు పుడతాడు. వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకు ఆనందమా? ప్రజల కోసం భరిస్తున్నా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయవచ్చు కానీ చేయలేదు. నాకు పదవులు మీద ఆశ లేదు అన్నారు పవన్ కళ్యాణ్.