పార్లమెంట్ కళాకారుడు శివప్రసాద్: ప్రత్యేకంగా ప్రశంసించిన మోడీ

  • Publish Date - September 21, 2019 / 09:12 AM IST

చిత్తూరు మాజీ ఎంపీ, తెలగుదేశం సీనియర్ శివప్రసాద్ కన్నుమూశారు. రెండు సార్లు చిత్తూరు నుంచి ఎంపీగా పార్లమెంటుకు వెళ్లిన శివప్రసాద్ పార్లమెంటు కళాకారుడుగా కూడా పాపులర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ 16వ లోక్‌సభ చివరి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ పేరును ప్రస్తావించారు. ఎంపీ శివప్రసాద్ మంచి నటుడని ప్రధాని మోడీ కితాబిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ చేసిన పోరాటంలో భాగంగా పార్లమెంటుకు వేరు వేరు రూపాల్లో విభిన్న వేషధారణలో వచ్చి అందరినీ నవ్విస్తూ పోరాడేవారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా కూడా శివప్రసాద్ వేషధారణ చూడగానే అన్నీ మరిచిపోతానంటూ మోడీ చెప్పారు. చిత్తూరు నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన శివప్రసాద్.. ఎప్పుడూ తన విచిత్ర వేషధారణతో అందరినీ ఆకట్టుకుంటారు.

ముఖ్యంగా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకహోదా కోసం పోరాటంలో విచిత్రంగా వేషధారణలు వేశారు. ఈ క్రమంలోనే మీడియా వారు ఎక్కువ కవరేజీ ఇచ్చేవారు. అంతేకాదు తన సహచర కూడా కాసేపు శివప్రసాద్ చెప్పే డైలాగులు విని మరీ సభలోకి వెళ్లేవారు. ఎన్ని వేషధారణలు వేసినా కూడా ఎన్ని పేలిపోయే డైలాగ్స్ పేల్చినా ఆయన డిమాండ్ ను మాత్రం అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు.