మూడో తరగతి విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్  

మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు.

  • Publish Date - September 13, 2019 / 11:33 AM IST

మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు.

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రకరకాల కారణాలతో విద్యార్థులను చితకబాదుతున్నారు. ఫీజులు కట్టడం లేదని, స్కూల్ కు ఆలస్యంగా వచ్చాడనే పలు కారణాలతో పిల్లలను చావబాదుతున్నారు. కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూర్ విస్ డమ్ స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

షేక్ రహాన్ అనే విద్యార్థి బ్రాహ్మణ కొట్కూర్ విస్ డమ్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులు స్కూల్ కు రాలేదని రహాన్ ను ప్రిన్సిపల్ సలీం రెండు రోజుల క్రితం తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడికి తీవ్ర జ్వరం వచ్చింది. వీపుపై, కణతకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే తల్లిదండ్రులు బాలున్ని అడగగా ప్రిన్సిపల్ తనను కొట్టాడని చెప్పాడు. 

దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ సలీం పరారీలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే అర్థర్ స్కూల్ దగ్గరకు చేరుకుని, విద్యార్థిని పరామర్శించారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also Read : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ : డాక్టర్లు లేక మహిళల ఇబ్బందులు