సెక్స్ వర్కర్ల జీవనోపాధి పోయింది వారికి రేషన్ ఇవ్వండి : సుప్రీంకోర్టు

  • Publish Date - September 22, 2020 / 04:29 PM IST

కరోనా ప్రభావంతో సెక్స్ వర్కర్లకు జీవనోపాధి కరువైందని వారికి రేషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. వారం రోజుల్లోగా సెక్స్ వర్కర్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. కరోనాను జాతీయ విపత్తుగా భావించిన సుప్రీంకోర్టు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జీవనోపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు సహాయం చేయాలని కేంద్రానికి సూచించింది. రేషన్ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.


సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డు ఉండనివారు చాలామంది ఉన్నారు. అది మానవ తప్పిదమే..కరోనా కాలంలో సెక్స్ వర్కర్లు జీవనోపాథిని కోల్పోయారు..ఈ కష్టకాలంలో వారికి కార్డులతో సంబంధం లేకుండా రేషన్ అందజేయాలని సుప్రీం కోర్టు సూచించింది. కరోనా పరిస్థితుల్లో చాలామంది జీవితాలు తల్లక్రిందులయ్యాయి. జీవనోపాధి కోల్పోయారు. దేశంలో చాలామంది సెక్స్ వర్కర్లపై కూడా ఈ కరోనా ప్రభావం పడింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షలాదిమంది రోడ్డున పడ్డారు.


ఇటువంటి విపత్కర పరిస్థితు్లలో కనీసం రేషన్ బియ్యం కూడా పొందలేక కడుపులు కాల్చుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటివారికీ న్యాయం చేయాలని దాఖలైన్ పిటీషన్ పై జస్టిస్ LN రావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్ కార్డు లేకపోవటం మానవ తప్పిదంగా పరిగణించి వారికి వారం రోజుల్లో అవసరమైన రేషన్ సదుపాయం కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్డు ఆదేశించింది. అంతేకాదు..జాతీయ విపత్తుల నిర్వహణ చట్టప్రకారం వారికి సహాయం చేయాలని కేంద్రానికి సూచించింది.


గత మార్చి 24 తరువాత దేవ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన క్రమంలో చాలామంది సెక్స్ వర్కర్లు జీవనోపాధి కోల్పోయారని దర్బార్ మహిళా సమన్వయ కమిటీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వారు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారని..ఆకలితో అలమటించిపోతున్నారని..అటువంటివారికి సహాయం చేయాలని కోరుతూ..సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.


లాక్ డౌన్ నుంచి అప్పులు చేసి జీవితాలను వెళ్లబుచ్చుతున్నారనీ..అటువంటివారి న్యాయం చేయాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటీషణ్ విషయంలో సీనియర్ అడ్వకేటన్ ఆనంద్ గ్రోవర్ మాట్లాడుతూ..ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కేవలం 52 శాతం మంది సెక్స్ వర్కర్లకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.