పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు

  • Publish Date - March 25, 2019 / 03:25 AM IST

‘తొక్క తీస్తా.. తోలు తీస్తా.. అంటున్నావ్ మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? అంటూ పవన్ కళ్యాణ్‌ను ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ. ప్రజాక్షేత్రంలో ఉన్నావనే విషయం మరిచిపోయి.. నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దంటూ వవన్‌కు వార్నింగ్ ఇచ్చారు.  ప్రభుత్వ పాలనను విమర్శించకుండా.. ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్‌ కళ్యాణ్ అని పృద్వీ విమర్శించారు.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?

గత ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్‌ అని, చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించిన పవన్.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుని సీఎం చేయాలని కష్టాలు పడుతున్నాడని ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు, పవన్ ఇద్దరికీ బుద్ధి చెబుతారని అన్నారు. మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైన అంటున్నావా? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది? అని నిలదీశారు. ఏప్రిల్‌ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు జనసేనని ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు.