బంపర్ ఆఫర్ : భోజనం తినండి, రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోండి

Pune eatery launches : అవును మీరు వింటున్నది నిజమే. తమ రెస్టారెంట్ లో పూర్తిగా భోజనం చేస్తే..వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ బహుమతిగా ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఆ ఏముంది తినడమే కదా..అని అనుకుంటున్నారా ? కానీ..తినాల్సింది 4 కేజీల బరువున్న భోజనం తినాలని వెల్లడిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పూణెలోని ఓ రెస్టారెంట్ ఈ విధంగా వినూత్న ఆలోచన చేసింది.

కరోనా వైరస్ కారణంగా..పలు రంగాలు తీరని నష్టాన్ని చవి చూశాయి. ఇప్పటికీ అవి తేరుకోలేకపోతున్నాయి. అందులో హోటల్ రంగం కూడా ఒకటి. పూణెలో కూడా పలు రెస్టారెంట్లు తీరని నష్టాన్ని చవి చూశాయి. ఆర్థికంగా పైకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే..పూణెలోని Wadgaon Maval ప్రాంతంలో ఉన్న శివాజీ హోటల్ ఓనర్ వినూత్నంగా ఆలోచన చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ఆఫర్ ను తీసుకొచ్చారు. ‘Win a Bullet bike’ ఆఫర్ ను ప్రకటించారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను గెలుచుకోవాలంటే..నాన్ వెజ్ థాలీని 60 నిమిషాల్లో తినేయాలని..ఇందులో గెలిస్తే.వారికి 1.65 లక్షల విలువైన బుల్లెట్ బైక్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ బుల్లెట్ భోజనం ఖరీదు రూ. 2500. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ పోటీని ప్రవేశపెట్టాలని అనుకున్నానని హోటల్ యజమాని Atul Waikar వెల్లడించారు. ఐదు కొత్త బైక్ లను రెస్టారెంట్ లో ఉంచారు. అందరికీ తెలిసేలా పెద్ద బ్యానర్ ను ఏర్పాటు చేశారు.

ఈ భోజనంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి, పోటీకి సంబంధించిన సూచనలు బ్యానర్ లో పొందుపరిచారు. మొత్తం 12 రకాల వంటలు ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పొం ఫ్రైట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ ఇతర వంటకాలు ఉంటాయి. ఈ స్పెషల్ థాలీని తయారు చేయడానికి 55 మంది వంటివాళ్లు పని చేస్తారు.

కొంతమంది ఈ పోటీల్లో పాల్గొన్నారని రెస్టారెంట్ యజమాని తెలిపారు. పోటీకి విపరీతమైన స్పందన వస్తోందని, కరోనా నిబంధనలు పాటిస్తూ..ఈ పోటీని నిర్వహించడం జరుగుతోందని Atul Waikar తెలిపారు. రోజుకు 65 థాలీలను విక్రయిస్తున్నారు. శివరాజ్ హోటల్ లో స్పెషల్ రావణ్ థాలీ, బుల్లెట్ థాలీ, మల్వాని ఫిష్ థాలీ, పహెల్వాన్ మటన్ థాలీ, బకాసుర్ చికెన్ థాలీ, సర్కార్ మటన్ థాలీలు అందుబాటులో ఉన్నాయి.

ఎనిమిది సంవత్సరాల క్రితం శివరాజ్ హోటల్ ప్రారంభించారు. తరచూ కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్ యాజమాన్యం వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇంతకుముందు..8 కిలోల రావన్ థాలీని 60 నిమిషాల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. నలుగురు వ్యక్తులు ఈ పోటీలో పాల్గొనగా..విజేతకు రూ. 5000 వేల నగదు బహుమతినిచ్చారు హోటల్ ఓనర్. ఇక బుల్లెట్ థాలీ విషయానికి వస్తే…మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన సోమనాథ్ పవార్ బుల్లెట్ థాలీని ఒక గంటలోపు పూర్తి చేయడంతో అతడికి బుల్లెట్ బహుకరించారు.

ట్రెండింగ్ వార్తలు