జగన్ ను కలిసిన ఆర్ నారాయణమూర్తి: కారణం ఇదే

  • Publish Date - September 27, 2019 / 06:21 AM IST

విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకునే కథానియకుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యల గురించి జగన్ ముందు ప్రస్తావించిన నారాయణ మూర్తి, తాండవ జలాశయంలోకి అదనపు జలాలను సమకూర్చడానికి విశాఖ జిల్లా చిన గొలుగొండపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పద్దతిని ఏర్పాటు చేయానలి కోరారు. పైపులైన్ ద్వారా రిజర్వాయరులోకి గోదావరి జలాలను అందించాలని సీఎం జగన్ ను కోరారు.

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికారికంగా 55వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అనధికారికంగా మరో 12వేల ఎకరాలకు సాగునీరు ఈ జలాశయం నుంచి అందుతుంది. అలాంటిది రిజర్వాయర్‌ నీటి మట్టం అడుగంటడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు నారాయణమూర్తి.

తాండవ జలాశయం గరిష్ట నీటిమట్టం 380 అడుగులు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఇప్పటి వరకు చేరలేదు. రైతుల కోసం ఈ మేరకు సాయం చేయాలని నారాయణమూర్తి కోరారు. గతంలో ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులు నేరం అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నారాయణ మార్తి ప్రశంసించారు.