ఎంపీ బరిలోంచి తప్పుకుని బీజేపీకి షాక్ ఇచ్చారు

  • Publish Date - March 29, 2019 / 03:33 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరుపున కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి జై కొట్టిగా.. ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న రాజంపేట అభ్యర్థి కూడా ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం(2019 మార్చి 28) నాడు రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మహేశ్వరెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

కడపజిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మహేశ్వరరెడ్డిని బీజేపీ ఇక్కడ నిలబెట్టింది. అయితే నామినేషన్‌ను ఉపసంహరించుకున్న  మహేశ్వరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు.  రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటిలో బీజేపీకి కాస్త క్యాడర్ ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేవని పోటీ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే మహేశ్వరెడ్డి అంతకుముందు వైసీపీలో ఉన్నారు.