వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

  • Publish Date - September 15, 2019 / 07:33 AM IST

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా వైసీపీలో చేరారు.

నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసం.. జగన్ పై నమ్మకంతోనే తాను వైసీపీలో చేరానని త్రిమూర్తులు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని సమర్థవంతమైన నేతను ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని చెప్పారు.

పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని తోట చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ, ఇతర పార్టీ నేతలు ఉన్నారు.