జగన్ వద్దన్నారు.. షర్మిల నిర్ణయమే.. : సజ్జల

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ప్రకటించడంపై కీలక విషయాలను వెల్లడించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల పార్టీ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు.. కోట్లాది మంది అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి.

జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిలమ్మ బయటకు వచ్చి సుధీర్ఘ పాదయాత్ర చేశారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సెటిలర్స్ ఉన్నా కూడా ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర విభజన నుంచి తెలంగాణలో పార్టీ వైఖరిపై ప్రశ్నలు వస్తూనే ఉన్నాయని, అయితే.. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసుకోవాలనే నిర్ణయంతో జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ నిర్మాణం వద్దనే ఉద్దేశ్యంతో ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు.

తెలంగాణ వెళ్లి ఏ ప్రయత్నం చేసినా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఇబ్బందులు వస్తాయని, కొంత గ్యాప్ వచ్చే పరిస్థితులు ఉన్నాయని జగన్ భావించారని.. అందుకే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు వద్దని జగన్ భావించినట్లు సజ్జల చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఫోకస్ దెబ్బతినడం జగన్‌కు ఇష్టం లేదని జగన్ చెప్పుకొచ్చారు.

అయితే, షర్మిలమ్మ గురించి తెలియదంటే బుకాయించినట్లే అవుతుందని.. రెండు మూడు నెలలుగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు ఎందుకు తీసుకుని పోకూడదు అని ఆమె భావించగా.. వద్దు అని చెప్పినట్లుగా ఆ సమయంలో తెలంగాణలో వేరే పార్టీ పెట్టి ఎందుకు ట్రై చెయ్యకూడదని ఆమె నిర్ణయించుకుంది అని అనుకుంటున్నాం అని అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి.. తెలంగాణాలో ఎందుకు జరగకూడదని ఆమె ఆలోచన కావొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ఆలోచనకు వైసీపీ వ్యతిరేకమని, తెలంగాణకు వెళ్తే వచ్చే ఇబ్బందుల గురించి షర్మిలకు చెప్పామని.. కానీ ఆమె సొంతంగా ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. షర్మిల పార్టీతో వైసీపీకి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే జగన్‌కు, షర్మిలకు మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ, విభేదాలు లేవని అన్నారు సజ్జల. వైసీపీ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలు ఉండవని, పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది ఏమీ లేదన్నారు.

మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి సహకరించారు కాబట్టే షర్మిల పాదయాత్ర చేశారని సజ్జల గుర్తుచేశారు. పార్టీలో పదవులు ఇవ్వలదని ఆమె ఇంకో పార్టీ పెట్టినట్లుగా వస్తున్నవార్తలు వాస్తవం కాదని అన్నారు. వైఎస్ మార్గదర్శకత్వంలో షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే..జగన్ విషెస్ ఉంటాయనే అనుకుంటున్నట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు