ఏపీ సర్కార్ నిఘా కన్ను: ఇసుక,మద్యం అక్రమ రవాణాలకు చెక్

ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా జిల్లాల్లోని అన్ని చెక్ పోస్టులపై కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.డిసెంబర్ 31లోగా అన్నిజిల్లాల్లోను చెక్ పోస్టుల్ని పూర్తిస్థాయిలో ప్రారంభించాలనీ అన్ని వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఉన్న చెక్ పోస్టులను పనితీరుల్ని నిరంతరం పరిశీలించాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారు.
ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలనీ ప్రతీ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవాలనీ సూచించారు. గనులు, పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్ అధికారులు..సిబ్బంది పోలీసులకు సహకరించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇసుక..మద్యం అక్రమ రవాణాలపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా అక్రమమార్గాల్లో ఇసుక, మద్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమరవాణాలపై మరింత నిఘా పెట్టాలని సీఎం జగన్ భావించారు. స్మగ్లర్ల పని పట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టక్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లోను చెక్ పోస్టులు పటిష్టంగా పనిచేయాలని ఈ విషయంలో కలెక్టర్లు పూర్తి బాద్యత తీసుకుని అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని దొరికినవారు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు.
ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి చెక్‌పోస్టు వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని..వాటిని నిరంతరం పర్యవేక్షించాలనీ..ప్రతీ పుటేజ్ ను భద్రపరిచి నిర్లక్ష్యం..అవినీతి అనే మాటకు తావు లేకుండా మద్యం..ఇసుక అక్రమ రవాణాదారుల పని పట్టాలని సీఎం జగన్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.