రోబో ముతైదువ..రెండు చుక్కలు వేసుకోండి..రాసుకోండి..అంతా మంచే జరుగుద్ది..

  • Publish Date - July 28, 2020 / 10:51 AM IST

కరోనాతో కుదేలైపోయిన తమ వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు వ్యాపారులు ఎన్నో రకాల పాట్లు పడతున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక తెరుచుకుంటున్న షాపులకు కూడా కష్టమర్లు పెద్దగా రావటంలేదు. దీంతో వ్యాపారులు ముఖ్యంగా బట్టల వ్యాపారులు కష్టమర్లను ఆకట్టుకోవటానికి సరికొత్త పద్ధతుల్లో ఆకర్షించుకునే పనిలో పడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ బట్టల షోరూంలో ఒక రోబో చక్కగా చీర కట్టుకుని ముతైదువలా సంప్రదాయ పద్ధతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది.

అంతేకాదండోయ్..అసలే కరోనా కాలంగా బాబూ..కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతా ఈ శానిటైజర్ రాసుకోండి…అంటూ శానిటైజన్ కూడా ఇస్తోంది. ఎరుపు, ఆకుపచ్చ చీర ధరించిన రోబో మాస్క్ పెట్టుకుని వినియోగదారుల వద్దకు వెళ్లి శానిటైజర్‌ను ఇస్తోంది. రోబో చర్యకు వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాల్‌లోకి వచ్చే కస్టమర్లను పసిగడుతూ చెంగు చెంగుమంటూ ఒకచోట నుంచి మరొక చోటుకి వెళ్తూ శానిటైజర్ అందిస్తోంది రోబో ముతైదువ.

కాగా, ప్రస్తుతం కరోనా కారణంగా మనుషులు లేకుండా రోబోల సాయంతో మాల్స్ నడిపిస్తున్నారు. అలాగే రెస్టారెంట్లు, పార్కులే కాకుండా జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. కరోనా కాలంలో రోబోల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది.