కర్నూలులో కరోనా మహమ్మారి: డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి!

  • Publish Date - April 18, 2020 / 02:26 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. 
అయితే లేటెస్ట్‌గా వైరస్ కారణంగా చనిపోయిన ఓ డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి ఈ వైరస్ సోకడం ఇప్పుడు కలకలం రేపుతుంది. కర్నూలు పట్టణంలో లేటెస్ట్‌గా 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు ఇటీవల మరణించిన ఓ డాక్టర్ కుటుంబ సభ్యులవే.

అలాగే, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో ఏపీలో 38 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, అనంతపురంలో 5, చిత్తూరులో 5, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో 4, కడపలో ఒక కేసు నమోదైంది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 572కు పెరిగింది.

ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు వెల్లడించారు.

Also Read | KTR గొప్ప మనస్సు : అర్ధరాత్రి 5 నెలల చిన్నారికి పాలు