ఏపీ శాసనమండలిలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

  • Publish Date - December 16, 2019 / 04:00 PM IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఆమోదం తెలిపింది. సోమవారం (డిసెంబర్ 16, 2019) శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత అపరాధముల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. 

మొత్తం 11 కీలక బిల్లులను మండలిలో ప్రవేశపెట్టగా ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిపై మం‍ళవారం (డిసెంబర్ 17, 2019) సభలో చర్చను చేపట్టనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది.

మరోవైపు ఏపీ అసెంబ్లీ 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు బిల్లు, ఏపీ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, ఏపీ రాష్ట్ర షెడ్యూల్ కులాల బిల్లు, ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. అలాగే ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లు, ఏపీ అబ్కారీ 2వ సవరణ బిల్లు, మద్యనిషేధం సవరణ బిల్లు, ఏపీ వస్తువులు, సేవల పన్నుల వసరణ బిల్లులు ఆమోదం పొందాయి.