ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన ఓ పోస్ట్‌ పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు మోను కుమార్‌ తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.
Also Read : వేలంలో నన్నేవరూ కొనరు : అదో ట్రేడ్ సీక్రెట్.. CSK సక్సెస్ మంత్రా చెప్పను

బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్‌ పచ్చగా లేదనుకుంటా అంటూ మోను కుమార్‌ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్‌ బట్టతలపై సెటైర్‌ వేస్తూ బీపాజిటివ్‌ హ్యాష్‌ ట్యాగ్‌ తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌ పై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ హర్ట్‌ అయ్యారు.

సాక్షి బట్టతల ఉన్న వాళ్ళపై సెటైర్లు వేయడం కొందరిని బాధించింది. సాక్షిని అనుసరిస్తూ మరికొందరు బట్టతలపై సెటైర్లు వేశారు. ఫ్లాట్‌ పిచ్‌ బాగుందని, బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ బట్టతలపై సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IPL 2019 : విశాఖ వేదికగా రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు