పీతల సుజాత కన్నీరు : మాట మార్చేసిన అంబికా కృష్ణ

  • Publish Date - April 3, 2019 / 09:40 AM IST

వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం TDPలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య మాటల యుద్ధం కలకలం రేపుతోంది. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంబికా కృష్ణ ఒక్క రోజునే మాట మార్చేశారు. పీతల సుజాతకు పొగరు, అహంకారం అంటూ అంబికా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పీతల సుజాత కన్నీరు పెట్టుకున్నారు.

దళిత మహిళ అని చూడకుండా లేనిపోని ఆరోపణలు చేయడంపై..ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేస్తుంటే పొగరుగా కనిపించిందా అంటూ ప్రశ్నించారు. నన్ను అవమానించడానికా..పార్టీని అవమానించడానికా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పీతల కన్నీరు పెట్టుకోవడంతో అంబికా కృష్ణ టర్న్ తీసుకున్నారు. తనకు ఆమె సోదరిలాంటిదని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 03వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మాట మార్చేశారు. లక్కవరం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడినట్లు…వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని తెలిపారు.  కొట్లాటవద్దని..బాబును సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు అంబికా. మరి అంబికా మాటలతో పీతల సుజాత మెత్తబడుతారా ? ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.