సోషల్ మీడియా ప్రచారం : వచ్చిన టీడీపీ టికెట్ పోయింది

  • Publish Date - March 22, 2019 / 04:52 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్ధి తెర్లాం పూర్ణంను అభ్యర్ధిత్వాన్ని మారుస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెర్లాం పూర్ణంను తొలగిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లలిత కుమారికి అభ్యర్ధిత్వంను ఖరారు చేసింది టీడీపీ. పూతలపట్టు నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి.. రెండుసార్లు కూడా చాలా తక్కువ ఓట్లతో ఓడిన లలితకుమారికి మళ్లీ అవకాశం కల్పించింది టీడీపీ.
Read Also : కొత్త ఆప్షన్ : రైలు టికెట్ బదిలీ చేసుకోవచ్చు

తవణంపల్లె మండలంకు చెందిన తేలం పూర్ణం టిక్కెట్ దక్కించుకున్నా.. పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చాయని.. ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఆయనపై ఒత్తిడి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

సోషల్ మీడియా ప్రచారంతో అలర్ట్ అయిన టీడీపీ నేతలు.. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతికి లలితకుమారిని పిలిపించారు చంద్రబాబు.. ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు. బీఫాం కూడా ఇచ్చేశారు. వాస్తవానికి వైసీపీ కార్యకర్త అయిన పూర్ణం.. గత ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ ఆశించి బంగపడ్డారు. టీడీపీలో ట్రై చేయడంతో అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశం సోషల్ మీడియా ప్రచారం, నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకున్నారు.

ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో గెలిచిన సునీల్ కుమార్‌కు కూడా వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ స్థానం నుంచి వైఎస్‌ఆర్ పార్టీ తరపున ఎంఎస్‌ బాబు బరిలోకి దిగారు. తాజా పరిణామాలతో పూతలపట్టు నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. 
Read Also : ఇ-ఆటోలు ప్రవేశపెట్టనున్న హైదరాబాద్ మెట్రో