టార్గెట్‌ జగన్‌ : రాక్షస ప్రభుత్వం – బాబు

  • Publish Date - September 5, 2019 / 10:01 AM IST

సీఎం జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫైర్ అయ్యారు. పాలనా అంతా వైఫల్యాల పుట్టా అంటూ విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇంత రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మరోసారి చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పాలనలో వైపీసీ ప్రభుత్వం అప్రతిష్టపాలైందని, మొత్తం నేరాలు..ఘోరాలే అన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. పులివెందుల పంచాయతీలను రాష్ట్రంలో చేయాలని చూస్తున్నారని..సొంత బాబాయిని ఇంట్లో చంపితే ఎవరు చంపారో చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులను ఆయన ప్రస్తావించారు.

తప్పుడు కేసులతో నాయకులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నరని బాబు తెలిపారు. అయినా..భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంపై ఈ విధంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు బాబు. 
Read More : ఆవును రక్షించేందుకు వెళ్లి మహిళ మృతి