తప్పు చేసినట్లు రుజువు చేస్తే..తన ఆస్తి..తన తండ్రి ఆస్తి పేద ప్రజలకు పంచిస్తా..లేనిపక్షంలో మంత్రి పదవిని బోత్స వదిలేస్తారా అంటూ టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం దుగ్గిరాలలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో చింతమనేని మాట్లాడారు.
తాను తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి తనను దొంగ అంటున్నారు..ఆయన ఏమన్నా దోరా ? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు తనపై కావాలనే కక్ష కట్టారని, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులపై కూడా ఆరోపణలు చేశారు. తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదని..విలువైన వస్తువులను పగులగొట్టారని తెలిపారు. తనని అణిచివేస్తే..జిల్లా అంతా అణిగిమణిగి ఉంటుందని అనుకుంటున్నారేమో..కానీ అలా జరగదన్నారు. ఏ విచారకైనా సిద్ధమని ప్రకటించారు చింతమనేని.
దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. దుగ్గిరాలలో అరెస్టు చేసిన పోలీసులు ఏలూరుకు తరలించారు. పోలీసుల వాహనాలను కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Read More : దుగ్గిరాలలో హైటెన్షన్ : చింతమనేని అరెస్టు