పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి బుధవారం(ఏప్రిల్ 10, 2019) రాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఆయన తన సతీమణి సమాధి దగ్గర నివాళి అర్పిస్తుండగా ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు, కార్యకర్తలు స్దానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.
నెల రోజులుగా ఎండలో ఎక్కువగా తిరిగి ప్రచారం నిర్వహించటం వల్ల అస్వస్ధతకు గురయ్యారని, ఎటువంటి ప్రాణ భయం లేదని డాక్టర్లు తెలిపారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని పల్లెను పరామర్శించారు. 2014 లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘునాధరెడ్డి.. చంద్రబాబు మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు. కొంత కాలానికి పదవి కోల్పోయారు. తర్వాత చంద్రబాబు ఆయనను చీఫ్ విప్ గా నియమించారు.