వింతగా ఉంది: విజయసాయి రెడ్డి చెప్పినట్లు వింటారా?

  • Publish Date - April 23, 2019 / 10:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిపాలన గురించి ఎలక్షన్ కమీషన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేయడం వింతగా ఉందని టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమీషన్ తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపించారు. సమీక్షలు నిర్వహించే హక్కు ప్రభుత్వంకు తేదా? కేబినేట్ సెక్రెటరీ దేశాన్ని పరిపాలిస్తారా? దీనిపై సుప్రీంకోర్టుకు పోతానంటూ హెచ్చరించారు.

విజయసాయి రెడ్డిది ఐఏఎస్‌లను జైళ్లలో ఇరికించిన చరిత్ర అని విమర్శించారు. అటువంటి విజయసాయి రెడ్డి చెప్పినట్లు ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ శ్రీలక్ష్మిని నడవకుండా చేసిన చరిత్ర వీళ్లది అని విమర్శించారు. వీళ్ల అరాచకాలు అర్థమయ్యి ప్రజలు క్లీన్ మెజారిటీ చంద్రబాబుకు ఇస్తున్నారని అన్నారు. ప్రజలు  23వ తేదీన చంద్రబాబుకు పట్టం కడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఆడపడుచులు వైసీపీ అధికారంలోకి రాకూడదని ఓటేసినరని అన్నారు. ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం సమీక్షలపై మాట్లాడుతున్నారని అన్నారు. మేమే పరిపాలిస్తాము అంటే చెప్పండి. అంటూ ఎలక్షన్ కమీషన్‌ను నిలదీశారు. మోడీ గారు ఏమైనా చేస్తాము అంటే కుదరదని అన్నారు. సమీక్షలు పెట్టకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని మేమేమి చదువుకోని పరిస్థితిలో లేమన్నారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని మాత్రమే రూల్ ఉందని, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగం ఉందని సంవత్సరంలో రెండు నెలలు రైతులను వదిలేయమని అనడం కరెక్ట్ కాదని అన్నారు. 

ట్రెండింగ్ వార్తలు