యాత్ర సినిమాను టీవీల్లో ఆపండి : ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

  • Publish Date - April 6, 2019 / 05:34 AM IST

అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు.  ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తికి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారని సినిమా ప్రదర్శించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వర్ల రామయ్య తెలిపారు.
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే

వైసీపీ అధినేత జగన్ బ్రాహ్మణి స్టీల్  ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తాననటం పట్ల వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే గాలి జనార్ధన రెడ్డితో కలిసి జగన్ లక్ష టన్నుల ఐరన్ ఓర్  దోచుకున్నాడని ఆరోపించారు. ఐరన్ ఓర్ లోడ్ తో వెళుతున్నలారీల కింద పడి 300 మంది దాకా చనిపోయారని రామయ్య తెలిపారు.  అలాంటి బ్రాహ్మాణి ఫ్యాక్టరీని తెరిపిస్తానంటే మళ్లీ  జగన్ అవినీతి కి పాల్పడుతున్నట్లే కదా అని  అన్నారు.
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల