సమస్యలపై పోరాటం : మున్సిపల్ ఆఫీసు వద్ద స్నానం చేసిన ఎమ్మెల్యే నిమ్మల

  • Publish Date - October 12, 2019 / 06:09 AM IST

ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ వేరే జరిగింది. అధికారులు స్పందించడం లేదంటూ ఆయన మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీరు, వీధి దీపాలు, అపరిశుభ్ర పరిస్థితుల సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు నిమ్మల. వినూత్నంగా నిరసనకు దిగారు.

అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు ఎమ్మల్యే నిమ్మల. ఉదయం వచ్చిన ఈ ఎమ్మెల్యే..కమిషనర్ కోసం రాత్రి 9 గంటల వరకు ఎదురు చూస్తూ కూర్చొన్నారు. కానీ ఆయనతో పాటు, ఇతర అధికారులు రాలేదు. దీంతో అక్కడే రాత్రి పడుకున్నారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం లేచి ఆరు బయట స్నానం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు ఎమ్మెల్యే నిమ్మల. అధికారులు వచ్చి సమస్యలపై స్పందించే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. మరి
ఈ ఎమ్మెల్యే చేస్తున్న నిరసనపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 
Read More : ఇంటి దొంగ : నకిలీ బంగారంతో ఎస్ బీఐలో రూ.18 లక్షల రుణం

ట్రెండింగ్ వార్తలు