మోడీ కళ్లు ఉంటే చూడండి : కేసీఆర్‌కు జగన్ ఊడిగం – బాబు

  • Publish Date - April 6, 2019 / 11:01 AM IST

పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారని..కళ్లు ఉంటే వచ్చి చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రికి వచ్చిన మోడీ..పోలవరంకు వెళ్లి చూస్తే అసూయపడి కళ్లు తిరిగి పడిపోయేవారని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు కందుకూరులో నిర్వహించిన సభలో మాట్లాడారు. 

2014లో చెప్పిన హామీలు నెరవేర్చానా ? లేదా ? అనేది ప్రజలు చెప్పాలన్నారు. చెప్పిన దానికంటే 50 ఎక్కువే చెశామని..డ్వాక్రా సంఘాలకు రెండో విడతలుగా డబ్బులు ఇచ్చామన్న బాబు..మూడో విడత కింద రూ. 4వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 07వ తేదీ నుండి నగదు బ్యాంకుల్లో తీసుకోవచ్చన్నారు. తాము ఇచ్చిన చెక్కులు చెల్లవన్న వైసీపీ ముఖాలే చెల్లవని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు ప్రతి సంవత్సరం పుసుపు – కుంకుమ పథకం వర్తింపు చేస్తామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు…మోడీ కంటే ముందుగానే తాను రాజకీయాల్లోకి వచ్చాను..లొంగనుగాక లొంగను అని స్పష్టం చేశారు. కేసుల కోసం వైసీపీ రాజీపడ్డారని, దొంగలను జైలులో పెడుతాను తప్ప..బయట తిరగనివ్వనని చెప్పారు. 

కేసీఆర్‌కు జగన్ ఊడిగం. 
అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను ఆదుకుంటాం.
చంద్రన్న బీమాను రూ. 10 లక్షలకు పెంచుతాం.
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుక రూ. లక్ష ఇస్తాం. 
పేద విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 25 లక్షలు.